మొగిలప్ప లాకప్ డెత్ కు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి..!
పలమనేరు, త్రిశూల్ న్యూస్ :
పెద్దపంజాణి మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన దళితుడు మొగులప్ప లాకప్ డెత్ కు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ నాయకులు డివి మునిరత్నం, వేలాయుధం డిమాండ్ చేశారు. అందులో భాగంగా బుధవారం రవికుమార్ అధ్యక్షతన పలమనేర్ పట్టణంలో జాతీయ మానవ హక్కుల కార్యాలయం నందు సమావేశం నిర్వహించి తీవ్రంగా ఖండించారు. మృతుడు మొగిలప్ప వికలాంగుడు కాబట్టి మద్యం సేవించి అలవాటు ఉందని అటువంటి వ్యక్తిని అక్రమ మద్యం అమ్ముతున్నాడనే నెపంతో పెద్దపంజాణి పోలీసులు క్రూరంగా కొట్టడం సమంజసం కాదన్నారు. పార్థసారథి మాట్లాడుతూ మృతుని భార్య తన భర్త అనారోగ్యవంతుడు కొట్టొద్దండని ఎస్సై శ్రీనివాసులును ప్రాధేయ పడుతున్న వినిపించుకోకుండా చితక బాదడం, దుర్మార్గమన్నారు. గుర్రం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మొగిలప్ప నిజంగా నేరం చేసి ఉంటే కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచాలేగాని సొంత నిర్ణయాలతో చట్టాన్ని చేతులకు తీసుకొని దళితుడు చనిపోయే విధంగా కొట్టడం సరికాదన్నారు. దళితుడు మొగిలప్ప లాకప్ డెత్ పై ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ జరిపి కారణమైన ఎస్సై, డాక్టర్, జైలు సూపరింటెండెంట్ లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మనీ, సుబ్రహ్మణ్యం, ఆనంద, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment