మేం ఏం చేశామో ప్రజలకు తెలుసు - విజయనగరం వైసిపి నేతలు

– టీడీపీ కూటమి నాయకులు వ్యాఖ్యలు అవగాహన రాహిత్యానికి నిదర్శనం

– ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని మేము వమ్ముచేయం

- భవిష్యత్‌లోనూ రాజాం అసెంబ్లీ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

– విజయనగరం ఎంపీ అభ్యర్ధి బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), రాజాం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ రాజేష్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ స్పష్టీకరణ
విజయనగరం, త్రిశూల్ న్యూస్ :
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ఇక్కడి ప్రజలకు తెలుసని విజయనగరం ఎంపీ అభ్యర్ధి బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), రాజాం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ రాజేష్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ లు తెలిపారు. వంగర మండలంలో తలగాం గ్రామంలో సోమవారం ‘ఇంటింటికీ వైసీపీ’ ప్రజా దీవెన కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వివరాలు తెలుపుతూ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో ‘ఫ్యాన్‌’ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. టిడిపి కూటమి అభ్యర్ధి అర్థంపర్థం లేని ఆవేశం తప్పితే ఎలాంటి అవగాహన లేదని అన్నారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి లేదని చెప్పడం చాలా ఆశ హాస్యాస్పదం అన్నారు. టిడిపి కూటమి అభ్యర్ధితో పాటు ఆయన పక్కనున్న వాళ్లకు కూడా ఇక్కడి పరిస్థితులు తెలియవని చురకలంటించారు. రాజాం ప్రజలకు ఆయన చేసిందేమీ లేదన్నారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తోందని, ఈ విషయం ఇక్కడి ప్రజలకు తెలుసని చెప్పారు. సంక్షేమ పథకాలకు తోడు ఎన్నడూ లేని విధంగా నాన్ డిబిటి ద్వారా రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశ్వాసం ఉంచారని, వారి ఆశీస్సులతో మరోసారి గతం కంటే అధిక మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరో 30 ఏళ్లు రాజాం అసెంబ్లీ వైసీపీకి కంచుకోటగా మారుతుందని అన్నారు.

ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయండి...!

రానున్న ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించాలని డాక్టర్ రాజేష్ కోరారు. ఇంటింటికీ వైసీపీ ప్రజా దీవెన యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని, సచివాలయాల పరిధి నుంచే అభివృద్ధి పనులు చేశామన్నారు.ఈ ఎన్నికల్లో జగన్‌కు మద్దతుగా ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజాం అసెంబ్లీ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని, దీన్ని మరింతగా కొనసాగించాలంటే రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ రాజేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వంగర ఎంపీపీ యూ. సురేష్ ముఖర్జీ, మండల పార్టీ అధ్యక్షులు కరణం సుదర్శన్ రావు, వైస్ ఎంపీపీ, జె.సి.ఎస్. కన్వీనర్ కిమిడి ఉమామహేశ్వర రావు, పి.ఏ.సి.ఎస్ అధ్యక్షులు మరిసర్ల విజయలక్మీ గంగారాం, స్టేట్ డైరెక్టర్ బొంతు వెంకటరావు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేమిరెడ్డి సూర్యనారాయణ, సర్పంచ్ సంకిలి రాధసురేష్, మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, బూత్ కమిటీ సభ్యులకు, మాజీ గ్రామ వాలంటీర్లు,సోషల్ మీడియా కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు