హైదరాబాద్ లో జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ..!

హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
హైదరాబాద్‌ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్‌ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించిన కీలక ప్రకటన ప్రసాదం పంపిణీదారు బత్తిన ఫ్యామిలీ చేసింది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప ప్రసాదం ఇచ్చేందుకు ఈ ఏడాది కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 8న ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని వేల మంది ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఈ ప్రసాదం ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూసే వాళ్ల సంఖ్య వేలల్లో ఉంటుంది. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ చేప ప్రసాదం బత్తిని కుటుంబం పంపిణీ చేయనుంది. దీని కోసం ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నట్టు సమాచారం. ప్రసాదం తయారీ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఏటా మృగశిర కార్తె ప్రవేశించిన రోజున ఈ ప్రసాదం బతికి ఉన్న చేపలో పెట్టి పంపీణీ చేస్తుంటారు. ఈ ఏడాది జూన్ 8న మృగశిర కార్తె ప్రవేశిస్తోంది. ఆరోజు చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నట్టు బత్తిన అనురీత్‌గౌడ్, గౌరీ శంకర్‌ గౌడ్‌లు వెల్లడించారు. చేప ప్రసాదం పంపిణీలో భాగంగా పంపిణీకి ముందు రోజుల ప్రత్యేక పూజలు చేస్తారు. ఏటా చేసినట్టుగానే ఈసారి కూడా సత్యనారాయణ స్వామి వ్రతం, తర్వాత భావి పూజచేసిన తర్వాత ప్రసాదం తయారీ ప్రక్రియ పూర్తి చేస్తారు. తర్వాత రోజు జూన్ 8 నుంచి పంపిణీ ప్రారంభిస్తారు. దీని కోసం వేలల్లో జనం తరలి వస్తారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు