ప్రభుత్వ మద్యం షాపుల్లో కూలింగ్ లేని మద్యం అమ్మకాలు..!

- జేబులకు చిల్లు తప్ప వేరే మార్గం లేదంటున్న మందుబాబులు 

 - మద్యంపై అధిక రేట్లు వసూలు చేస్తున్న సర్కార్ 

-  పేద బలహీన వర్గాల కుటుంబాలు కుదేల్.. అటకెక్కిన మద్యపానం నిషేధం హామీ 
సిద్ధవటం, త్రిశూల్ న్యూస్ :
సిద్ధవటం ప్రభుత్వ మద్యం షాపుల్లో మద్యం ప్రియులకు ఆశ నిరాశ అయింది. అసలే దట్టమైన వేసవికాలంలో కాస్త ఉపశమనం కోసం ప్రభుత్వ వైన్ షాప్ కి వెళ్లి బీరు కొనుగోలు చేయగా కూలింగ్ లేని మందు ఇస్తున్నారని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎలక్షన్ లో దశలవారీగా మద్యపానం నిషేధిస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకపక్క చెప్పినా కూడా అది ఏ మాత్రం అమలు కాలేదని పూర్తిగా మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్లో పోటీ చేస్తామని ఆయన రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం ఏమో కానీ మా జేబులకు చిల్లు పడుతుందని అధిక రేట్లు వసూలు చేసి ఏమాత్రం నాణ్యతలేని బీర్లు అమ్మకాలు చేస్తున్నారని బూమ్ 180, కె ఎఫ్,2Oo, RF అల్ట్రా 22O,, ఎలిఫెంట్, 2,6O, ఇలా ముక్కు పిండి వసూలు చేస్తూ కూలింగ్ లేకుండా అమ్మకాలు చేస్తున్నారని ప్రభుత్వానికి ఆదాయం మాకు నిరాశ తప్ప ఏం లేదని, నాణ్యతలేని మద్యం అమ్మకాలతో మా కుటుంబాలతో చెలగాటం ఆడుతున్నారని మద్యం బాబులు మండిపడుతున్నారు. పూర్తిగా మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్ లో పాల్గొంటాంని చెప్పిన హామీ గాలికి వదిలేశారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు  ప్రొబుషన్ ఎక్సైజ్ శాఖ ఎస్సై మహేష్ వివరణ కోరగా సిద్ధవటం ప్రభుత్వ మద్యం షాపుల్లో గత నాలుగు నెలలుగా కూలింగ్ ఫ్రిడ్జ్ పాడైపోయిందని ఉన్నత అధికార దృష్టికి తీసుకెళ్లామని ఆయన అన్నారు

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు