చీకట్లో ఉన్న ఉదయమాణిక్యంలో వెలుగులు నింపేందుకు కృషి చేస్తా - పులివర్తి నాని

చంద్రగిరి, త్రిశూల్ న్యూస్ : 
గడిచిన 10 ఏళ్లుగా ఉదయమాణిక్యం పంచాయితీ అభివృద్ధికి నోచుకోక చీకట్లో మగ్గుతుందని, ఒక్క అవకాశం ఇస్తే వెలుగులు నింపేందుకు కృషి చేస్తానని చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. బుధవారం యర్రావారిపాళెం మండలం, ఉదయమాణిక్యం పంచాయితీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒకలా... ఎన్నికల తర్వాత మరోలా ప్రవర్తిస్తూ నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో టీడీపీ సానుభూతిపరుడైన ఎన్ఆర్ఐ అబ్దుల్ ఆలీ భాకరాపేటలో పరిశ్రమ స్థాపించి కొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కక్షగట్టి కాంపౌండ్ వాల్ తొలగించారని చెప్పారు. ఆయనకు బలవంతంగా వైసీపీ కండువా కప్పారని అన్నారు. భాకరాపేట నుంచి యలమంద వరకు డబుల్ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో గల్లా అరుణ కుమారి తలకోన సిద్దేశ్వర ఆలయం అభివృద్ధికి కృషి చేసిందని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈ 5 ఏళ్లలో 5 వేలు కోట్లు సంపాదించి ఒంగోలుకు మకాం మార్చారని దుయ్యబట్టారు. ఒక్క అవకాశం ఇస్తే కుటుంబ సభ్యుడులా అండగా ఉంటానన్నారు. 
టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

ఎర్రవారిపాలెం మండలం, ఉదయమాణిక్యం పంచాయతీకి చెందిన రెడ్డప్ప రెడ్డి, రమణారెడ్డి, పి.రమణారెడ్డి, రాజన్న, చెంచు రెడ్డి, యన్.గోపీనాథ్, షమీర్, రమణయ్య, ఫీరు సాబ్, రెడ్డి సాహెబ్, ఆదాం, శంకరయ్య, ఆనంద్ రెడ్డి, ఎంజి వెంకటరత్నం, శివరామయ్య, ఎం సుబ్బరామయ్య, ఎస్ సుబ్బరామయ్య, రామచంద్ర, వెంకటరత్న, రాజా మోహన, సిద్దయ్య, సురేంద్రబాబు, సురేంద్ర, రమణ నాయక్, భాను ప్రసాద్, బాలాజీ నాయక్, సిద్ధారెడ్డి, పార్థసారథి, సుబ్రహ్మణ్యం పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు