జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టమును పటిష్టంగా అమలు చేయాలి..!

- భ్రూణ హత్యలను నివారించండి - కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టమును పట్టిష్టంగా అమలు చేయాలని ఉల్లంఘన చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అని ఆడపిల్లల పట్ల వివక్షత ఉండకూడదు అని తెలిపారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టాన్ని కటినంగా అమలు చేయడం ద్వారా భ్రూణ హత్యలను నివారించవచ్చని అన్నారు. జిల్లాలో ప్రతి నెల అన్ని స్కానింగ్ కేంద్రాలలో డాక్టర్లు తనిఖీలు నిర్వహించాలన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడుతున్న స్కానింగ్ సెంటర్ల వారి రిజిస్ట్రేషన్ తొలగించడం జరుగుతుందని అన్నారు. స్కానింగ్ సెంటర్లో రిజిస్ట్రేషన్, రెన్యువల్ మరియు ఇతర మోడీఫికేషన్ దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ మార్చాలన్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి అనుమతి తప్పనిసరిగా పొందాలని తెలిపారు. ఈ చట్టమును అతిక్రమించిన వారికి రూ.50000 రూపాయలు జరిమానాతో బాటు 3 సంవత్సరాల కఠినమైన శిక్ష లు ఉంటాయని తెలిపారు. జిల్లాలో 215 స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయనీ తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని సమాచారం తెలిసినవారు 102, 104 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తెలియజేయవచ్చని తెలిపారు. కావున ప్రజలలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టం పై అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా. శ్రీహరి, డి ఐ ఓ శాంత కుమారి, దిశా డి.ఎస్.పి కాటమరాజు, గైనకాలజిస్ట్ డా. మాధవి, పీడియాట్రిస్ట్ డా. కిరిటి, రేడియాలజిస్ట్ డా. నాగేశ్వరరావు, డెమో బాబు నెహ్రు రెడ్డి , డి పి ఎం ఓ శ్రీనివాసరావు ఎన్ జీ ఓ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు