టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరికలు..!
– ఎమ్మెల్యే అనంత సమక్షంలో చేరిన రూరల్ పంచాయతీ నేతలు
అనంతపురం, త్రిశూల్ న్యూస్ :
అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీ బీసీ విభాగం రీజనల్ ఇన్‌చార్జ్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో అనంతపురం రూరల్ పంచాయతీకి చెందిన టీడీపీ నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే అనంత కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. రూరల్ పంచాయతీ రామకృష్ణ కాలనీకి చెందిన టీడీపీ కీలక నేతలు హనుమంత్‌రాయుడు, వేణు, చెన్నకేశవులు, నౌషాద్, పెద్ద నాగన్న, చిన్ని నాగన్న, చంద్రశేఖర్, సాహిద్ వలి, కేశవయ్య, పుల్లయ్య, లక్ష్మిదేవి, లవనీత, రమణమ్మ, సుజాత, దేవి, మహమ్మద్ వలి, రమేష్ ఆచారి, శీనా ఆచారి, క్రాంతికుమార్, మహేంద్ర, విజయ్‌కుమార్, శీనాయాదవ్, హరి, ప్రదీప్ యాదవ్, హైదర్‌వలి, అల్లాబకష్, శివయ్య, బిబు, దిలీప్, నంద, గురువిజయ్, వేణుగోపాల్ తదితరులు తెలుగుదేశం పార్టీని వీడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు అనంతపురంలో జరుగుతున్న అభివృద్ధిలో తామూ భాగస్వాములు కావాలన్న ఆకాంక్షతో వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. పేదల జీవితాలు మారాలంటే మరోసారి వైసీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీ అభ్యర్థి శంకర నారాయణను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ కోగటం విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment