కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా..? బెట్టింగ్‎లో ఆ అంశమే కీలకం..?

కుప్పం, త్రిశూల్ న్యూస్ :
కుప్పంలో రికార్డు స్థాయి పోలింగ్ ఎవరికి అనుకూలం. అత్యధిక ఓటింగ్ శాతం నమోదు ఏ పార్టీకి కలిసి వచ్చే అంశం. పెరిగిన ఓటింగ్ శాతంపై ఎవరి లెక్కలు వారివే కాగా కుప్పం దంగల్‎లో గెలుపు ఓటములే కాదు.. లక్ష ఓట్ల మెజారిటీ అంశం బెట్టింగ్‎లో కీరోల్‎గా మారింది. లక్ష ఓట్ల మెజార్టీ టార్గెట్‎గా టిడిపి ఫైట్ చేస్తే చంద్రబాబు ఓటమే లక్ష్యంగా వైసీపీ పనిచేసింది. దీంతో కుప్పంలో గెలుపు ఎవరిదన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశమైంది. ఏపీ రాజకీయాల్లో కుప్పం ఫలితం రాజకీయాల్లో తీవ్ర చర్చగా మారింది. కుప్పంలో టిడిపి అధినేత చంద్రబాబు పోటీలో ఉండడం.. అధికార వైసీపీ కుప్పంను టార్గెట్ చేయడంతో అందరి దృష్టి కుప్పంపైనే ఉంది. 1989 నుంచి వరుస విజయాలు అందుకుంటున్న చంద్రబాబు ఇప్పటిదాకా 7 సార్లు అసెంబ్లీకి వెళ్ళారు. టిడిపి జెండాను ఎగురవేశారు. ఎనిమిదో సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే గెలుపు కోసం పార్టీ క్యాడర్‎ కూడా అలుపెరగకుండా పనిచేసింది. కుప్పంలో గెలవడమే కాదు లక్ష ఓట్ల మెజార్టీ టిడిపి టార్గెట్ అంటూ ఈ ఎన్నికల్లో పనిచేసింది. మరోవైపు చంద్రబాబు ఓటమే లక్ష్యంగా వైసీపీ పోల్ మేనేజ్మెంట్ కూడా చేసింది. ఇలా గెలుపోటములపై ధీమాగా ఉన్న రెండు పార్టీలపై లక్షల్లో జనం బెట్టింగ్ కాస్తుండగా ఏపీ పాలిటిక్స్‎లో కుప్పం రిజల్ట్ స్పెషల్ అట్రాక్షన్‎గా మారబోతోంది. ఒకరికేమో లక్ష ఓట్ల లక్ష్యం, మరొకరికి చంద్రబాబు ఓటమి లక్ష్యం. ఇలా సాగిన ఎలక్షన్ కుప్పంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో పోలింగ్ శాతం పెరిగేందుకు కారణం అయింది. 1989 నుంచి వరుస విజయాలు సాధించిన చంద్రబాబు 8వ సారి అత్యధిక మెజార్టీతో గెలవాలన్న లక్ష్యంతో గత ఎడాదిగా కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కుప్పం నుంచి పోటీ చేసే ప్రతిసారి కనీసం స్వయంగా వచ్చి నామినేషన్ కూడా వేయని చంద్రబాబు ఈ ఎన్నికల్లో గతానికి భిన్నంగా వ్యవహరించారు. కుటుంబ సభ్యుల చేత నామినేషన్ దాఖలు చేయించారు. చంద్రబాబు తరఫున నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయడమే కాకుండా కుప్పంలో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు నారా, నందమూరి కుటుంబాలు ప్రచార బాధ్యతలు కూడా చేపట్టాయి. ఇక 1989 నుండి ఇప్పటిదాకా ఎప్పుడూ లేనివిధంగా కుప్పంలో దాదాపు 90 శాతం పోలింగ్ నమోదు కాగా.. లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యానికిగాను ఎమ్మెల్సీ శ్రీకాంత్‎కు ఆ బాధ్యతలను టిడిపి హై కమాండ్ అప్పగించింది. లక్ష ఓట్లు మెజార్టీ సాధించాలన్న లక్ష్యంగానే 6 నెలల్లో మూడుసార్లు చంద్రబాబు కుప్పంలో పర్యటించారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు