నవరత్నాల పథకాలు కొనసాగాలంటే వైసిపి ప్రభుత్వం రావాలి - అంజూరు తారక శ్రీనివాసులు

శ్రీకాళహస్తి, త్రిశూల్ న్యూస్ :
శ్రీకాళహస్తి పట్టణం  సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా12,15వార్డుల్లో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు వైయస్సార్సీపి నాయకులు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైయస్సార్సీపి తిరుపతి పార్లమెంట్  అభ్యర్థి గురుమూర్తి మరియు  శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి  ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి నవరత్నాలు అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని, ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో అవ్వా తాతల పింఛన్, అమ్మ ఒడి, రైతు రుణమాఫీ, అందరికీ ఉచిత ఆరోగ్యశ్రీ వైద్యం, పేదలందరికీ పక్కా ఇల్లు, వైయస్సార్ ఆసరా, ఫీజు రీయంబర్స్మెంట్, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, ఇలాంటి పథకాలని మళ్ళీ మనకు రావాలి అంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని తెలియజేశారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రజలు అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలన్నీ  తీరుస్తారని  తెలియజేశారు. శ్రీకాళహస్తి పట్టణ ప్రజలందరూ ఈ పథకాలను గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అఖండ మైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు గురు నాగరాజు, కొల్లూరు హరినాథ్ నాయుడు, ఆవుల శ్రీనివాసులు, అస్లాం, మాధవరావు జై పవర్, స్వర్ణ మూర్తి, పగడాల రాజు, కంట ఉదయ్ కుమార్, మొగరాల గణేష్, చాంద్ భాషా, పూడి రవి, ఉత్తరాజ శరణకుమార్, జయ, జలగం కిషోర్, గరికిపాటి చంద్ర, గోపాల్ రెడ్డి, పసల కుమారస్వామి, శ్రీవారి సురేష్,కృష్ణ,  రాజేంద్ర, సురేష్, ఎంఆర్ మురళీ, పుట్టం రాజా ముదిరాజ్, హంస మనోహర్, ఇబ్రహీం, కిరణ్, బాలశెట్టి నరసింహులు, శంకర్, పటాన్ ఫరీద్, వల్లం గోపి, షేక్ జూబ్లీషా, వేలూరు రమేష్, గాంధీ, ఫియాజ్, బుగ్గ హరి, కుమార్, శ్రీనాథ్,ముని, రాఘవ, దినేష్, మనీ రెడ్డీ, ప్రకాష్, జూమ్లేష భాయ్, మురళి, జయ, విజయ్ కుమారి, లతా, సుశీల, సాగర్ బి, షర్మిల ఠాగూర్, జైశ్రీ, ఈశ్వర్ సాయి, మనోజ్, వినోద్ కుమార్, వంశీకృష్ణ, మరియు వైయస్సార్సీపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు