వెంకటాయపల్లి హరిజనవాడలో త్రాగునీటి కోసం అవస్థలు.. పట్టించుకోని అధికారులు..!
సిద్ధవటం, త్రిశూల్ న్యూస్ :
రాజంపేట జిల్లా పొన్నవోలు కొత్తపల్లి గ్రామ పంచాయతీ వెంకటాయపల్లి హరిజనవాడలో రెండు రోజుల క్రితం తాగునీటిమోటార్ కాలిపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని త్రాగు నీటి కోసం కిలోమీటర్ దూరంలో ఉన్న రైతుల పొలం వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ విషయాన్ని సంబంధిత అధికారులు కు ఫిర్యాదు చేసిన వారు ఏమాత్రం చర్యలుచేపట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ట్యాంకర్ ద్వారా నీటిని అందించాలని హరిజనవాడ ప్రజలు పేర్కొంటున్నారు. బోరు పనిచేయకపోవడంతో తీవ్ర నీటి సమస్య తెలెత్తిందన్నారు. త్రాగు నీటి కోసం ఎర్రటి ఎండ లో వ్యవసాయ బోర్ల వద్ద పరుగులు తీస్తూ నీరు తెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. గ్రామంలో ఆదివారం గంగమ్మకు ముద్దలు పండుగ ఉందని త్రాగునీరు లేకపోతే పండుగ ఆగిపోతుందని ఇప్పటికే గ్రామంలో బంధువులను పిలుచుకుందామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఇంచార్జ్ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని వివరణ కోరగా రేపు ఆ ప్రాంతానికి వెళ్లి సమస్య పరిష్కారం చేస్తామని ఆయన అన్నారు
Comments
Post a Comment