కొవిషీల్డ్‌తో దుష్పరిణామాలు.. భారత్‌లోనూ ప్రకంపనలు..!

- సుప్రీంకోర్టును ఆశ్రయించిన విశాల్‌ తివారి న్యాయవాది
న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
కొవిషీల్డ్‌తో దుష్పరిణామాలు నిజమేనని బ్రిటన్‌ ఫార్మా కంపెనీ అంగీకరించడంతో భారత్‌లోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. కోవిషీల్డ్ టీకా వేసుకున్నవారికి జరిగిన దుష్పరిణామాలపై అధ్యయనం చేసేందుకు మెడికల్ నిపుణులతో ప్యానెల్‌ ఏర్పాటు చేయాలంటూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొవిడ్‌ టీకా కొవిషీల్డ్‌తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్‌ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనకా అంగీకరించడంతో ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పుట్టింది. కొవిషీల్డ్‌ టీకా వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్‌ కౌంట్‌ పడిపోవటం వంటి పరిస్థితులకు దారితీయవచ్చని బ్రిటన్‌ హైకోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్స్‌లో ఆస్ట్రాజెనకా వెల్లడించినట్లు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ది టెలిగ్రాఫ్‌ ఓ కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకంపనలు రేపడంతో భారత్‌లో విశాల్‌ తివారి అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోవిషీల్డ్ టీకా వేసుకున్నవారికి జరిగిన దుష్పరిణామాలపై అధ్యయనానికి మెడికల్ నిపుణుల ప్యానెల్‌ ఏర్పాటు చేసేలా కేంద్రాన్నిఆదేశించాలని కోరారు. ఢిల్లీ ఎయిమ్స్‌ డైరక్టర్‌తో పాటు సుప్రీంకోర్ట్ రిటైర్డ్‌ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఈ ప్యానెల్ పనిచేసేలా చూడాలని న్యాయవాది కోరారు. అదే సమయంలో కొవిషీల్డ్‌ కారణంగా మరణించిన అలాగే తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొన్న వారికి నష్టపరిహారం చెల్లించేలా సుప్రీంకోర్ట్‌ ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది కోరారు. భారత్‌లో కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీకి పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు లైసన్స్‌ ఇచ్చిన సంగతిని న్యాయవాది తివారి గుర్తు చేశారు. భారత్‌లో 175 కోట్ల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు వేశారని కూడా న్యాయవాది సుప్రీంకోర్ట్‌ దృష్టికి తెచ్చారు. మరోవైపు ఆస్ట్రాజెనకాపై బ్రిటన్‌లో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. కొవిషీల్డ్‌ కరోనా టీకా అనేక సందర్భాల్లో మరణాలతోపాటు తీవ్ర దుష్ప్రభావాలకు కారణమైనట్లు ఆరోపిస్తూ బ్రిటన్‌ హైకోర్టులో 50మందికి పైగా బాధితులు కేసులు వేశారు. 100 మిలియన్‌ పౌండ్ల నష్ట పరిహారం కోరారు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఆస్ట్రాజెనకా, అరుదైన సందర్భాల్లో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగే అవకాశం ఉందని ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన ఓ నివేదికలో తెలిపింది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు