లేడీ కాదు పెద్ద కిలాడీ.. 16 ఏళ్ల బాలుడిపై కన్నేసిన 27 ఏళ్ల మహిళ..!
సిద్దిపేట, త్రిశూల్ న్యూస్ :
కొందరిని చూసినా.. వారి గురించి విన్నా.. వీరెక్కడి మనుషులురా బాబూ అనిపిస్తుంటి. ఇప్పుడీ వార్త చదివితే అచ్చం అలాంటి అభిప్రాయం కలుగక మానదు. అవును.. 27 ఏళ్ల మహిళ.. 16 ఏళ్ల మైనర్ బాలుడిపై కన్నేసింది. ఆ పిల్లాడిని అన్ని రకాలుగా వాడుకుంది. ఈ ఎపిసోడ్‌లో ఎన్నో ట్విస్టుల అనంతరం చివరికి ఊచలు లెక్కిస్తోంది ఆవిడగారు. సిద్దిపేటలో సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. సిద్దిపేటలోని హనుమాన్ నగర్‌లో ఓ ఇంట్లో మహిళ గత మూడేళ్ళుగా తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఇంటి యజమాని కొడుకుపై కన్నేసింది. మాయమాటలతో ఆ బాలుడిని లోబర్చుకుంది. శారీరకంగానూ అతన్ని వాడుకుంది. ఎక్కడికైనా వెళ్లిపోదామని.. బాలుడి ఇంట్లో ఉన్న నగదు, నగలు తీసుకురావాలని మభ్యపెట్టింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 22న భర్త, పిల్లల్ని వదిలేసి బాలుడితో చెన్నై పారిపోయింది మహిళ. ఇంట్లో కిరాయి ఉన్న మహిళ, తన కొడుకు ఏక కాలంలో కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. తాజాగా మహిళ, బాలుడి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. చెన్నైలోనే బాలుడితో వివాహిత ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. విషయం తెలుసుకున్న మహిళ.. పోలీసులు పట్టుకుంటారన్న అనుమానంతో.. బాలుడిని సిద్దిపేటలో ఇంటి వద్ద వదిలేసింది. అయితే, బాలుడు తీసుకువచ్చిన నగలను చెన్నైలో అమ్మేసి మహిళ జల్సా చేసింది. చివరకు మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Post a Comment