మాట నిలబెట్టుకున్న చంద్రన్న.. ఆరుద్ర కూతురు వైద్యానికి రూ.5 లక్షల సాయం..!

తూర్పుగోదావరి, త్రిశూల్ న్యూస్ :
వైఎస్సార్సీపీ హయాంలో నరక యాతన అనుభవించిన కాకినాడకు చెందిన ఆరుద్రకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నేరవేర్చారు. వెన్నుపూస తీవ్రంగా దెబ్బతిని అచేతనమై, వీల్ చైర్‌కే పరిమితమైన ఆరుద్ర కూతురు సాయిలక్ష్మీచంద్ర వైద్యం కోసం ప్రభుత్వం రూ. 5 లక్షల సాయాన్ని అందజేశారు. సచివాలయంలో బాధితులకు సీఎంఓ అధికారులు చెక్‌ను అందజేశారు. జగన్‌ ప్రభుత్వంలో తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని, నాడు ప్రతిపక్ష నేతగా అండగా నిలిచిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అన్ని విధాలా ఆదుకున్నారని ఆరుద్ర తెలిపారు. గత ప్రభుత్వంలో మంత్రి దాడిశెట్టి రాజా వద్ద గన్ మెన్లుగా పని చేస్తున్న కానిస్టేబుళ్లు, తనను తీవ్రంగా వేధించడంతో అప్పట్లో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఆరుద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. మంత్రి అండతో తనను వేధిస్తున్న వారి పై కేసులు పెట్టాలని కోరితే తన పైనే అక్రమ కేసులు నమోదు చేసి వేధించిన్నట్లు బాధితురాలు గుర్తు చేశారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు