అబుజ్ మాడ్ అడవుల్లో భారీ ఎన్ కౌంటర్.. 8 మంది నక్సల్స్ మృతి

దంతేవాడ, త్రిశూల్ న్యూస్ :
నారాయ‌ణ‌పుర్, కంకేర్, దంతేవాడ‌, కొండ‌గావ్ జిల్లాల‌కు చెందిన భ‌ద్రతా ద‌ళాలు యాంటీ న‌క్సల్ ఆప‌రేష‌న్ చేప‌డుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నారాయణపూర్ జిల్లాలోని అబుజ్‌మాడ్ అడ‌వుల్లో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంట‌ర్ కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే దండకారణ్యం వార్‌ జోన్‌గా మారింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు కగార్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అబూజ్‌మడ్ అడవులే టార్గెట్‌గా జనవరి నుంచి జల్లెడ పడుతున్నాయి. భద్రతా బలగాలు ఏప్రిల్ 16వ తేదీన జరిగిన కాంకేర్ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ తరువాత జరిగిన ఘర్చోలి ఎన్‌కౌంటర్‌ లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 11వ తేదీన బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోలు చనిపోయారు. ఇవాళ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంట ర్‌లో 8 మంది మృతి చెందారు. వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లుతోంది. దీంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మావోలు, ఆదివాసీ నివాస ప్రాంతాలపై చాపర్లతో డ్రోన్‌లతో బాంబింగ్ చేస్తున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. మరోవైపు ఛత్తీస్‌ గఢ్ దండకారణ్యంలో నరమేధం సాగిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు