Trishul News

పరదాల పాలనకు స్వస్తి.. రాష్ట్రంలో మార్పు మొదలైంది - ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

- ఎన్నికల హామీల అమలుపై చంద్రబాబు ‘తొలి సంతకాల’తో సంబరం

- సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కూటమి శ్రేణులు
నందిగామ, త్రిశూల్ న్యూస్ :
బటన్‌ నొక్కుడుకు మాత్రమే బయటికి వచ్చి... వచ్చిన ప్రతిసారీ పరదాలు కట్టి, బారికేడ్లు పెట్టి, చెట్లు కొట్టే పాలనకు తెర పడిందని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేసారు. నందిగామ కాకానీ నగర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే సౌమ్య, కూటమి శ్రేణులు, డీఎస్సీ ఆశావహులు పాలాభిషేకం నిర్వహించారు. మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేసిన సందర్భంగా నిరుద్యోగులు క్షీరాభిషేకం చేశారు. నిరుద్యోగులు ఐదేళ్ల పాటు తమ విలువైన సమయాన్ని కొల్పోయారని ఎమ్మెల్యే సౌమ్య ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్టాన్ని చూసి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ నెరవేర్చుకున్నామని సౌమ్య తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఐదు కీలక హామీల అమలుపై నిర్ణయం తీసుకున్నారన్నారు. 16,347 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేలా ‘మెగా డీఎస్సీ’ని ప్రకటిస్తూ... ఆ ఫైలుపైనే చంద్రబాబు తొలి సంతకం చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టడం ఇదే తొలిసారి అన్నారు. ఇక... జగన్‌ సర్కారు రైతుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించేలా చేసిన ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ రద్దుపై చంద్రబాబు రెండో సంతకం చేశారని తెలిపారు. రైతుల భూములను వివాదాస్పదం చేసి, కబ్జాదారులకు కోరలు తొడిగేలా రూపొందించిన ఈ చట్టాన్ని సమాధి చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారన్నారు. జూలైలో ఈ 3నెలల బకాయి 3వేలు, పెరిగిన పింఛను రూ.4వేలు కలిపి మొత్తం 7వేలు అందుతాయన్నారు. అలాగే దివ్యాంగుల పింఛను రూ.4వేల నుంచి 6 వేలకు పెంచుతున్నామన్నారు. వారికి బకాయిలతో కలిపి జూలైలో రూ.12 వేలు అందుతుంది’’ అని వివరించారు. జగన్‌ రాగానే మూసేసిన ‘అన్న క్యాంటీన్ల’ను పునరుద్ధరిస్తూ చంద్రబాబు నాలుగో సంతకం చేశారు. ఇక.. రాష్ట్రంలోని యువత, ప్రైవేటు ఉద్యోగుల్లో ఎటువంటి ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయో తెలుసుకొని... వారికి మరింత నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన నైపుణ్య గణన (స్కిల్‌ సెన్సెస్‌) నిర్వహణపై చంద్రబాబు ఐదో సంతకం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post