పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు..!

- ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పులివర్తి నాని
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
తిరుమల శ్రీవారిని గురువారం సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్ర ధారణతో చంద్రబాబు, లోకేష్, దేవాన్ష్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకి అర్చకులు స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి పద్మావతి అమ్మవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అర్చకులు తీర్ద ప్రసాదాలు అందించారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు