మావోయిస్టుల కుట్రను విఫలం చేసిన ములుగు పోలీసులు..!

ములుగు, త్రిశూల్ న్యూస్ :
మందుపాతరాలు అమరుస్తుండగా ఒక డిప్యూటీ దళ కమాండర్,ఇద్దరు దళ సభ్యులు సహా ముగ్గురు మిలిషియా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు. తెలంగాణ- ఛత్తీస్గడ్ సరిహద్దులో గల వెంకటాపురం మండలం తడపాల అటవీ ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కి చెందిన ఇద్దరు మహిళలు, నలుగురు మగ మిలిసియా సభ్యులను పట్టుకొన్న పోలీసులు. వారి వద్ద నుండి ఒక డిబిబిఎల్ ' తుపాకి, నాలుగు కిట్ బ్యాగులు, రెండు వాకి టాకీలతో పాటు భారీగా ప్రేలుడు సామాగ్రి స్వాధీనం.

పట్టుబడిన వారి వివరములు:

1) కారం భుద్రి @ రీతా D/o విజ్ఞాలు, వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ దళ డిప్యుటీ కమాండర్,

2) సోడి కోసి @ మోతే D/o అడమాలు. పామేడు ఏరియా కమిటీ సభ్యురాలు,

3) సోడి విజయ్ @ ఇడుమ s/o జోగ, బెటాలియన్ సభ్యుడు.

4) కుడం దస్రు s/o గంగ, మిలిషియా సభ్యుడు.

5) సోడి ఉర్ర s/o గంగయ్య, మిలిషియా సభ్యుడు

6) మడకం భీమ s/ o కోస, మిలిషియా సభ్యుడు.

పట్టుబడిన మావోయిస్టులు పలు నేరారోపిత కేసులలో ప్రధాన నిందితులు. ప్రభుత్వ నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పని చేస్తూన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోలీస్ ఎదుట స్వచ్చందంగా లొంగిపోవాలని పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ శబరిష్.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు