Trishul News

రాష్ట్రంలో చంద్రబాబు ప్రజాపాలన ప్రారంభమైంది - కుప్పం ఇంచార్జి మునిరత్నం


- డిఎస్సీపై మొదటి సంతకంతో సంబరాల్లో కుప్పం తెదేపా శ్రేణులు

- కేక్ కట్ చేసి, చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తెలుగు తమ్ముళ్లు
కుప్పం, త్రిశూల్ న్యూస్ : 
రాష్ట్రంలో చంద్రబాబు ప్రజాపాలన డిఎస్సీపై మొదటి సంతకంతో ప్రారంభమైనదని కుప్పం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి పి. ఎస్. మునిరత్నం పేర్కొన్నారు. శుక్రవారం కుప్పం పట్టణంలోని ఆర్టీసీ కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబునాయుడు కీలక డిఎస్సీ ప్రకటనపై,ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపై, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ పై, పెన్షన్ రూ. 4000 పెంపు పై, స్కిల్ సెన్సస్ పై , మొదటి 5 సంతకాలు చేసిన శుభ సందర్భంగా కేక్ కట్ చేసి పంచి పెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా పిఎస్. మునిరత్నం మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ప్రజలు నరకాసురుని పాలనలో పడిన కష్టాలకు ఈ నెల 12న ముగింపు పలకి.. ప్రజాపాలనతో చంద్రన్న పాలన ప్రారంభమైందని తెలిపారు. రాబోయే 5ఏళ్లల్లో రాజధాని అమరావతిగా స్వర్ణయుగం పాలన సాగుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూసి.. కుప్పం నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి పాడి ఆవులతో పాటు సబ్సిడీలో గడ్డి, గురుకులం ద్వారా పశువులకు షెడ్లు నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post