సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయాలి - ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
- ప్రజాసమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలి
- నియోజకవర్గ ముఖ్య అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ, త్రిశూల్ న్యూస్ :
నియోజక వర్గంలో గత 5ఏళ్ళ నుండి ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కుంటు న్నారని, వీటిని అత్యవసరంగా గుర్తించి పరిష్కరించే దిశగా అధికారులు దృష్టి సారించాలని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించారు. శుక్రవారం తనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన అధికారాలతో మాధవి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో తన దృష్టికి వచ్చిన పలు ప్రజాసమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటిని అత్యవసరంగా పరిష్కారించాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో కలుషితనీరు సరఫరా అవుతుందని, సమస్యను పరిష్కరించాలని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని, గతంలో మున్సిపల్ మంచినీటి పైపులైన్లలో కలుషిత డ్రైనేజి నీరు కలవడంతో అనేక మంది ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యారని, సౌమ్య గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి నిర్లక్ష్యాలు జరగటానికి వీలులేదని, వెంటనే దీనిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం పలువురు అధికారులు, రాజకీయ నాయకులు తంగిరాల సౌమ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Post a Comment