ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. మొదటి సంతకం డిఎస్సీపైనే..!
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలోని తన ఛాంబర్ నందు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం మెగా డీఎస్సీపై చేశారు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైల్ పై రెండో సంతకం చేశారు. వృద్ధాప్య పెన్షన్లను రూ.4 వేలకు పెంచడానికి సంబంధించిన ఫైల్ పై చంద్రబాబు మూడో సంతకం చేశారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం చేశారు. స్కిల్ సెన్సెస్ ఫైల్ పై చంద్రబాబు ఐదో సంతకం చేశారు. చంద్రబాబు వెంట మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర్ రావు ఎమ్మెల్సి కంచర్ల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. బాధ్యతల స్వీకరణకు ముందు చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సామాన్య ప్రజలు, స్కూల్ విద్యార్థులను సైతం ఆహ్వానించారు. వారి సమక్షంలోనే ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్, డీజీపీ హరీశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment