పార్లమెంట్ లో పార్టీ కార్యాలయం మార్పు కోసం స్పీకర్ ను కలిసిన టిడిపి ఎంపీలు..!
న్యూఢిల్లీ, త్రిశూల్ న్యూస్ :
పార్లమెంట్ లో గురువారం గౌరవ టిడిపి ఎంపీలు అందరూ కలిసి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాని కలిసి వినతి పత్రం అందించారు.. పార్లమెంట్ భవన్ లో ఫస్ట్ ఫ్లోర్ లో తెలుగుదేశం పార్టీకి కేటాయించిన కార్యాలయం చిన్నదిగా వుండటంతో కొంచెం విశాలమైన స్థలం వున్న కార్యాలయం కేటాయింపు చేయవల్సిందిగా కోరారు. టిడిపి పార్లమెంట్ పక్ష నేత లావు కృష్ణదేవరాయ ఆధ్వర్యంలో టిడిపి ఎంపీలు అందరూ కలిసి వెళ్లి స్పీకర్ ఓం బిర్లా గారికి వారి విజ్ఞప్తి విన్నవించుకున్నారు. అలాగే గతంలో టిటిపికి కేటాయించిన కార్యాలయాన్నే కొనసాగించాల్సిందిగా కూడా అభ్యర్ధించారు. స్పీకర్ ఓం బిర్లాని కలిసిన వారిలో కేంద్రమంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్, విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్ యాదవ్, నంద్యాల ఎంపి బైరెడ్డి శబరి, అమలాపురం ఎంపి జీ.ఎం. హరీష్ బాలయోగి ఉన్నారు.
Comments
Post a Comment