పోలీసు శాఖను కింది స్థాయి నుంచి ప్రక్షాళన చేస్తాం - హోంమంత్రి
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. పోలీసు శాఖను కింది స్థాయి నుంచి ప్రక్షాళన చేస్తామని హెచ్చరించారు. గతంలో పోలీసులు తనపై అట్రాసిటీ కేసులు పెట్టారని ఆరోపించారు. లేని దిశ చట్టాన్ని గత ప్రభుత్వంలో చూపించారని మండిపడ్డారు. పోలీసులు చట్టప్రకారం పనిచేయాలని సూచించారు. చాలా మంది ఉన్నతాధికారులు జగన్‌కు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్నారు. అన్యాయాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
Comments
Post a Comment