నగర పంచాయతీని సుందరంగా తీర్చిదిద్దాలి - ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు
- ప్రజలు రైతుల పనుల పట్ల ఏ అధికారైన నిర్లక్ష్యం వహిస్తే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటాం
మడకశిర, త్రిశూల్ న్యూస్ :
మడకశిర మున్సిపాలిటీలో చాలా దరిద్రంగా ఉంది వర్షాకాలంలో పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే రాజు పేర్కొన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులతో కలిసి సమన్వయంతో పని చేయాలన్నారు, అదనంగా మరి కొంత మంది పారిశుద్ధ కార్మికులను కూడా కేటాయించుకునే విధంగా చూస్తామన్నారు. మున్సిపాలిటీలో పరిశుభ్రత విషయంలో రాజీ పడేది లేదని ఆయన అధికారులకు హెచ్చరించారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని అన్న క్యాంటీన్లో ఉన్నటువంటి పరికరాలు విలువైన వస్తువులు కనిపించడం లేదని ఆ పరికరాలు వెంటనే ఎక్కడున్నాయో చెప్పకపోతే అప్పటి ఉన్న అధికారుల పైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పట్టణంలో 2000 కొత్త ఇల్లు నిర్మాణాలు ఆగిపోయాయని గృహ నిర్మాణ లబ్ధిదారులతో ప్రభుత్వాన్ని నిబంధనల మేరకు మాత్రమే వసూలు చేయాలని ఈ అధికారైన అదనంగా డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని వారికి హెచ్చరించారు, దీనివల్ల భవన నిర్మాణ కూలీలు. వ్యాపారులు, తదితర పనిముట్లు చేసుకుని చేతి వృత్తుల వారు అందరూ బాగుపడితే మున్సిపాలిటీకి మంచి ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు, పట్టణంలో విపరీతంగా పందులు విపరీతంగా తిరుగుతున్నాయని ప్రజల ఆరోగ్యమే మనకు ముఖ్యమని పందుల యజమానులను గుర్తించి ప్రజలకు అటు పందుల యజమానులకు ఇబ్బంది లేకుండా బయట ప్రాంతాల్లో పందులను ఒక చెట్లలో ఉంచే విధంగా చూడాలన్నారు. అక్రమ లేఔట్లు కచ్చితంగా క్రమబద్ధీకరించి మున్సిపాలిటీకి ఆదాయం పెంచాలన్నారు. పట్టణంలో పలుచోట్ల తాగునీటి సమస్యను త్వరత గతిన పూర్తి చేయండి అని అధికారులకు సూచించారు. నీటి సమస్య విషయంలో వైసిపి కొంతమంది సర్పంచుల మాటలు పట్టించుకోవద్దని ఆ సర్పంచులు ప్రభుత్వానికి చెట్టు పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలకు నీటి సమస్యను తీర్చకుండా రాజకీయం చేస్తున్నారని అలాంటి వారిని కార్యదర్శులు పట్టించుకోవద్దని కార్యదర్శులు ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే నీటి సమస్యలను పరిష్కరించాలి.అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలన్నారు. రొల్ల మండలంలో నీటి సమస్య ఎద్దడి తీవ్రంగా ఉందని వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో నీటి సమస్య కొరతపై 220 పనులు గాను 110 పనులు పూర్తి చేశామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ నీటి ట్యాంకులు శుభ్రం చేయాలన్నారు మీరు కలుషితం కాకుండా చూసుకోవాలని డే ఏరియా పై జాగ్రత్తలు తీసుకోవాలని క్లోరినేషన్ ని చేయాలని అధికారులకు ఆయన సూచించారు, నియోజకవర్గంలో రైతుల 1బి, జనన,మరణ ధ్రువీకరణ పత్రాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులకు ఆయన సూచించారు, నియోజకవర్గంలో సచివాలయ ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని వారికి ఆయన హెచ్చరించారు, సాక్షి పత్రిక లో వచ్చే అవాస్తవ వార్తలను దృష్టిలో పెట్టుకొని పనిచేయవద్దండి మీ మనస్సాక్షి తో పని చేయండి అంటూ అధికారులకు సూచించారు, ఈ కార్యక్రమంలో ఐదు మండలాల ఎంపీడీవోలు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు,
Comments
Post a Comment