Trishul News

సకాలంలో పనులు పూర్తి చేయకపోతే చట్టపర చర్యలు - కమిషనర్ అదితి సింగ్

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయకపోతే చట్టపర చర్యలు తీసుకుంటామని పనులు చేపట్టిన కాంట్రాక్ట్ ఏజెన్సీలకు తిరుపతి స్మార్ట్ సిటీ ఎం.డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ హెచ్చరికలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తిరుపతి నగరంలో పనులు చేపట్టిన కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వాహకులతో, ఇంజనీరింగ్ అధికారులతో శనివారం కమిషనర్ అదితి సింగ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నూతన కార్పొరేషన్ భవన నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, సకాలంలో పనులు పూర్తికి కృషి చేయాలన్నారు. కచ్చఫి వద్ద ఏర్పాటు చేయబోవు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులపై స్పందిస్తూ ఇప్పటికే ఆలస్యమైన విషయాన్ని ప్రస్థావిస్తూ ఇకపై ఆలస్యం తగదని, పనులు వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా మల్టి లెవల్ కార్ పార్కింగ్ పనులు, శ్రీనివాససేతు క్రింది భాగాల్లో చేయాల్సిన ఏర్పాట్లు, వినాయకసాగర్ పెండింగ్ పనులు, మురికినీటి శుద్ది నిర్వాహణ పనులు, ఇతర పనుల స్థితి గతులపై చర్చించి పనుల వేగవంతానికి కాంట్రాక్టర్లు పని చేయాలని, నిర్మాణాల పనులపై అధికారులు దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, ఎప్పటికప్పుడు జరుగుతున్న పనుల వివరాలను తనకు నివేదించాలని తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఎం.డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, స్మార్ట్ సిటి జనరల్ మేనేజర్ చంద్రమౌళి, అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈలు విజయకుమార్ రెడ్డి, మహేష్, ఏయికాం సంస్థ ప్రతినిధి భాలాజీ, ఆఫ్కాన్ సంస్థ ప్రతినిధి రంగస్వామి, స్మార్ట్ సిటీ సిబ్బంది, కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post