నాలుగు రోజులు పర్యటన నిమిత్తం 23న కుప్పం రానున్న నారా భువనేశ్వరి..!

కుప్పం, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజులు పర్యటన నిమిత్తం ఈ నెల 23న కుప్పం రానున్నట్లు టిడిపి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 23న హైదరాబాద్ నుండి బెంగళూరు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన బయలుదేరి కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలం కమ్మగుట్టపల్లి, కంచిబందార్లపల్లి, గుత్తార్లపల్లి, కోటపల్లి గ్రామాలలో పర్యటన చేయనున్నారు. 24న కుప్పం టౌన్ నందు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంబిస్తారు. అనంతరం కుప్పం మండలం ఎన్ కొత్తపల్లి, నడుమూరు, పైపాళ్యం, ఓబనపల్లి, గుడ్లనాయనపల్లి గ్రామాల పర్యటన అనంతరం  ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు ఇతర నాయకులు  కో ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నారు. 25న శాంతిపురం మండలం సోమాపురం, కర్లగట్ట, బోడుగుమాకులపల్లి, రామకుప్పం మండలం ఆవులకుప్పం, నారాయణపురం తాండ, ఆరిమానిపెంట, వీర్నమాల గ్రామాలలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. 26న శాంతిపురం మండలం కడపల్లె వద్ద చంద్రబాబు కోసం నిర్మిస్తున్న గృహాన్ని పరిశీలిన చేసి పిఈఎస్ ఆడిటోరియం నందు మహిళలకు సెయింగ్ మెషిన్స్ పంపిణీ చేసి మహిళలతో సమావేశం కానున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా బెంగళూరు విమానాశ్రయం బయలుదేరి వెళ్తారని ప్రకటన ద్వారా తెలిపారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు