Trishul News

సానిపాయ పరిధిలో 8ఎర్రచందనం దుంగలు స్వాధీనం..ఒకరి అరెస్టు..!

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
అన్నమయ్య జిల్లా సానిపాయ అటవీ ప్రాంతంలో 8ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఒకరిని టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ చెంచుబాబు సూచన మేరకు ఆర్ఐ (ఆపరేషన్స్) సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ లింగాధర్ టీమ్ స్థానిక అటవీ శాఖ సిబ్బందితో కలసి సానిపాయ బేస్ క్యాంపు నుంచి రాయవరం మీదుగా ఆవుల దారి, సరస్వతి కటువ, ముదుంపాడు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేసుకుంటూ వెళ్లారు. లోమోర నిషేధిత అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుంటూ వెళుతూ కనిపించారు. వారిని హెచ్చరించి చుట్టుముట్టగా, వారు దుంగలను పడేసి పారిపోసాగారు. అయితే టాస్క్ ఫోర్సు సిబ్బందిని వారిని వెంబడించి, ఒక వ్యక్తిని పట్టుకోగలిగారు. మిగిలిన వారు చిమ్మ చీకట్లో కలసి పోయారు. పట్టుకున్న వ్యక్తిని తమిళనాడు తిరువన్నామలై జిల్లా అత్తిపట్టు, వీరప్పనూరు పంచాయితీకి చెందిన రమేష్ (32)గా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి ఆ ప్రాంతంలో పడి ఉన్న 8ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో నమోదు చేసిన సీఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post