అత్యాచార ఘటనపై ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వర్కింగ్ చైర్మన్ వి ఎస్ ఎన్ కుమార్ ధ్రిగ్భ్రాంతి
విజయనగరం, త్రిశూల్ న్యూస్ :
అభం శుభం తెలియని ఆరునెలల చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన సంఘటనపై, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ వి ఎస్ ఎన్ కుమార్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఘోషాసుపత్రికి వెళ్లి వైద్యులు, స్త్రీ శిశు సంక్షేమ అధికారులను ఆయన వాకబు చేశారు. బాలికకు మరింత మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు నెలల పసికందుపై అత్యాచారం చేయడం చూస్తే సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు. అశ్లీలత, అసభ్య కరమైన వీడియోలు ఇంటర్నెట్ లో పెట్టడం, సినిమా, టివి సీరియళ్లలో మహిళలను అసభ్యంగా చూపించడం వలనే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిండితుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
Comments
Post a Comment