నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. జిల్లాలకు రెడ్ అలర్ట్..!

హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. శుక్రవారం 4 జిల్లాల్లో, శనివారం 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 20వ తేదీన కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయ శంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ఏకంగా 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఇవేకాకుండా మరో 6 జిల్లా ల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా సమయాల్లో ఒకేసారి వరద ముంచుకురావడం, రోడ్డులు, లోలెవల్ వంతెనలు మునిగిపోవడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు సంభవించే ఛాన్స్ ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలు లు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు