తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం..!
తిరుమల, త్రిశూల్ న్యూస్ :
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం ఉదయం విఐపి బ్రేక్ దర్శన వేళల్లో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి అన్నదాతలు చల్లగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే తన సత్యవేడు నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పుత్తూరు మున్సిపల్ కౌన్సిలర్ కెనడి తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment