రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తాం..!
- ప్రజాసమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతాం
- అధికారులు సకాలంలో స్పందించకపోతే చర్యలు తప్పవు
- సంక్షేమ సారధి చంద్రన్న హయాంలో పేదల బ్రతుకుల్లో వెలుగులు
సత్యవేడు, త్రిశూల్ న్యూస్ :
నవ్యాంధ్ర ప్రధాత , పేదల సంక్షేమ సారధి మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెదేపా సత్యవేడు నియోజకవర్గ పరిశీలకులు చంద్రశేఖర్ నాయుడు పేర్కోన్నారు. శనివారం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని పుత్తేరిలో ఎమ్మెల్యే ఆదిమూలం పర్యటన, రైతులకు పచ్చిరొట్టెవిత్తనాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనాసురుని అసుర పాలన అంతమొంది సరిగ్గా నెలరోజులు గడిచాయని అన్నారు. ప్రజలు చంద్రన్న పాలనను కోరుకుంటున్న విషయంను అత్యధిక మెజార్టీని అందించి, నిరూపించారని పేర్కోన్నారు. గత ప్రభుత్వం ప్రజలు ఎదుర్కోన్న సమస్యలు ఇక ఉండబోవని చెప్పిన ఆయన, సమస్యలు ఉన్నట్లు అయితే ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చి తక్షణ పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఎవైనా సమస్యలు తలెత్తితే అధికారులు సకాలంలో స్పందించాలని సూచించిన ఆయన, అధికారుల పనితీరుపై పిర్యాదులు వస్తే, చర్యలు చేపట్టక తప్పదని హెచ్చరించారు. తెలుగు దేశం ప్రభుత్వంలో చంద్రన్న సారధ్యంలో పేదల బ్రతుకుల్లో వెలుగుల నిండాయని, రాష్ట్రంలో సువర్ణపాలన కొనసాగుతుందని అన్నారు.
Comments
Post a Comment