ముదివేడు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ సహా నలుగురు సస్పెండ్..!
తంబళ్లపల్లి, త్రిశూల్ న్యూస్ :
కురబలకోట మండలంలోని ముదివేడు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ సహా నలుగురు సస్పెండ్ అయ్యారు. అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం, కురబలకోట మండలం, ముదివేడు వద్ద ఉండే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రెండు రోజుల క్రితం 9వ తరగతి చదివే ముగ్గురు మైనర్ బాలికలు మాత్రలు మింగి ఆత్మహత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపల్ రఫియాపర్వీన్, హిందీ టీచర్ గౌషియామస్తానీ, ఏఎన్ఎం భాను, అకౌంటెంట్ లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Post a Comment