బిసి, ఎస్సి హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్..!
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బీసీ, ఎస్సీ హాస్టల్ లను శుక్రవారం ఉదయం టిడిపి కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు దుప్పట్లు, బెడ్, దిండ్లు అందజేశారు. హాస్టల్ లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ లో విద్యుత్ దీపాలు, ఫ్యాన్ లను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అందులో భాగంగానే కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని బీసీ, ఎస్సీ హాస్టల్ భవనాలను పడగొట్టి నూతన భవనాలు కట్టెందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హాస్టల్ లో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిరోజు ఒకరు హాస్టలను సందర్శించి విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవాలన్నారు. నాణ్యమైన, రుచికరమైన భోజనాలు విద్యార్థులకు అందించాలని ఆదేశించారు అనంతరం మునిస్వామిపురం కాలనీలో స్థానిక ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సత్యేంద్రశేఖర్, రాజ్ కుమార్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment