34 సంవత్సరాల చరిత్రను తిరగ రాసిన పవన్ కళ్యాణ్ - జనసేన నేత కిరణ్ రాయల్

- ఏపీలో వాడవాడలా ఘనంగా స్వతంత్ర వేడుకలు
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo, భారతదేశం గర్వించే విధంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ భారీగా నిధులను విడుదల చేసి.. ఘనంగా వాడవాడలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని.. ఇది దేశం గర్వించదగ్గ విషయమని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆశాబావం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా ముందు జనసేన నాయకులు సుమన్ బాబు, మనోజ్, కిషోర్, షరీఫ్, ఆది, వినోద్, శ్రీనివాసులు, సుమంత్, లోకేష్, సుధాకర్, మురళి తదితరులతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. గత వైసిపి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు.. ప్రోగ్రామ్ లకు విడుదల చేసిన ఫండ్స్ లను దిగమింగి.. తూ తూ మంత్రంగా జరిపే వాళ్ళని గుర్తు చేశారు. గత 34 సంవత్సరాలుగా పంచాయతీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వంద, రెండు వందల రూపాయల నిధులను విడుదల చేసే చరిత్రను తమ పవన్ కళ్యాణ్ తిరగరాసారని, మైనర్ పంచాయతీ కి 10, 000 మేజర్ పంచాయతీ కి 25, 000 చొప్పున నిధులు విడుదల చేయించడం హర్ష నీయమన్నారు. ఈ జీవోను విడుదల చేసినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రెస్ మీట్ అనంతరం దువ్వాడ శ్రీనివాస్ గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా... గత వైసిపి ప్రభుత్వం లో తమ జనసేనాని ని మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని విమర్శించారని.. ఇది కర్మ సిద్ధాంతం అని, కర్మ సిద్ధాంతం ఎవ్వరిని విడిచిపెట్టదని, దువ్వాడ జగన్నాథం సినిమా ఎంత హిట్టో .. అంతకుమించి దువ్వాడ శ్రీనివాస్ పెళ్లిళ్ల బాగోతం.. సూపర్ డూపర్ హిట్టుగా ఈ దువ్వాడ శ్రీనివాస్ పెళ్లిళ్ల .. కర్మ సిద్ధాంతం అంతర్జాలంలో మారు మ్రోగుతున్నదని చురకలు విసిరారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు