మహానీయుల ఆశయ సాధనలో మనం ముందుకు సాగాలి - మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి, త్రిశూల్ న్యూస్ :
స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానీయుల ఆశయ సాధనలో మనం ముందుకు సాగాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాయచోటి పట్టణంలోని తమ క్యాంపు కార్యాలయంలో ఉదయం మంత్రి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని వారి త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమన్నారు. నేడు మనమందరం వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధనలో ముందుకు సాగాలన్నారు.
Comments
Post a Comment