జాతీయ సమైక్యతను కాపాడటం మనందరి భాద్యత - ఎస్ ఈబి ఎస్సై పి.నాగలక్ష్మి

- రణస్థలం ఎస్ ఈ బి స్టేషన్లో ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
రణస్థలం, త్రిశూల్ న్యూస్ :
 జాతీయ సమైక్యతను సమగ్రతను కాపాడటం మనందరి భాద్యత అని రణస్థలం ఎస్ ఈబి ఎస్సైలు పి. నాగలక్ష్మి, రవి ప్రసాద్ అన్నారు. రణస్థలం ఎస్ఈబి స్టేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండా వందనం చేసిన అనంతరం ఎస్సైలు మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడే ఈ మహోన్నత కార్యక్రమంలో యువత భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులను వారి నిస్వార్థ సేవలను వారీ త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యమన్నారు.
స్వాతంత్ర పోరాటం భారతదేశ చరిత్రలో ఓ మైలురాయని.. వేలమంది అమరవీరుల త్యాగ ఫలితమే నేటి మన భవిష్యత్తు అని పేర్కొన్నారు. బ్రిటిషర్ల 200 ఏళ్ల వలస పాలనలో భారతదేశం అర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎంతో నష్టపోయిందని.. స్వాతంత్ర్యం తర్వాత క్రమంగా దేశ ప్రజల్లో చైతన్యం పెరిగిందన్నారు. అలాంటి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు నిండిపోయాయని.. ఇన్ని సంవత్సరాలలో దేశం ఎన్నో రంగాలలో ఎంతో ప్రగతిని సాధించిందన్నారు. దేశ ప్రజలను ధర్మ మార్గంలో పాలించి శాంతి సౌఖ్యాలను అందించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు