ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితం స్వాతంత్ర్య దినోత్సవం - అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం, త్రిశూల్ న్యూస్ :
ఎంతో మంది మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్య దినోత్సవం అని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవంను పురస్కరించుకుని అనంతపురం జిల్లా కేంద్రంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, వైయస్సార్ సీపీ శ్రేణులతో కలిసి అనంత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి, మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ వారి నుండి మన దేశాన్ని కాపాడేందుకు ఎన్నో ఉద్యమాలు జరిగాయని, ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకుని అమరులయ్యారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని, ప్రజల గడప వద్దకే సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. కార్యక్రమంలో వైయస్సార్ సీపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు