వరద బాధితుల సహాయార్థం రూ. 10వేలు అందించిన రైతు..!
పలమనేరు, త్రిశూల్ న్యూస్ :
వరద బాధితుల సహాయార్థం ఓ సామాన్య రైతు రూ. 10వేల చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పలమనేరు మండలం టీ.వడ్డూరు పంచాయతీ బెరపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి అనే రైతు వరద బాధితులకు తన వంతు సాయంగా రూ.10 వేల చెక్కును స్థానిక టీడీపీ కార్యాలయానికి చేరుకొని మండల నాయకులకు అందించారు. ఈ మొత్తాన్ని సిఎం సహాయ నిధికి పంపాలని ఆయన కోరారు. ఓ సామాన్య రైతుగా ఉండి బాధితులకు తన వంతుగా సాయం అందించడం పట్ల పలువురు ఆయన్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగరాజు రెడ్డి, నాయకులు స్వతంత్ర బాబు, రామ చంద్ర తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment