కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేయండి - వై ఎస్ షర్మిల
- తిరుపతి జిల్లా కాంగ్రెస్ నేతలకు పిసిసి అధ్యక్షురాలు ఆదేశాలు
విజయవాడ, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నాయకులు సిద్ధం కావాలని, ఆ దిశగా ముందుకు సాగాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశించారు. బుధవారం విజయవాడలోని ఆంధ్రరత్న భవనంలో పిసిసి అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డిని తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాల గురవం బాబు, తిరుపతి నగర అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు, పిసిసి ఉపాధ్యక్షుడు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నర్సింహులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షురాలు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు నాయకులు ఎప్పుడు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Comments
Post a Comment