విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది - ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి


తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
రేవల్యూషనరి విద్యార్థి సంఘం (ఆర్ ఎస్ యు) ప్రథమ జాతీయ మహాసభలు సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరము ప్రతినిధులు యూనివర్సిటీ లోపలికి ర్యాలీగా వెళ్లారు అనంతరం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ప్రభుత్వము చిన్న బిన్నం చేసిందని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కుదురుపడుతుందని తెలిపారు. సీబీఎస్ఈ పై ఎటువంటి అవగాహన లేకుండానే గత ప్రభుత్వము రాష్ట్రంలో అమలు చేసిందని విద్యార్థుల్లో గందరగోళం నెలకొల్పడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఎటువంటి సిబ్బంది లేకుండానే అమలు ఎలా సాధ్యమవుతుందని మళ్లీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సీబీఎస్ఈ సిలబస్ పై రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో అమలు అయ్యేలాగా అన్ని రకాల వసతులు అధ్యాపకులను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే గత ప్రభుత్వము ఎంబీఏ ఎంసీఏ విద్యార్థులు గీయాల్సిన రద్దు చేస్తూ జీవో తెచ్చి యాజమాన్యానికి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపించిందని కానీ ప్రస్తుత ప్రభుత్వము కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలుకు కట్టుబడి ఉందని తెలిపారు. గత ప్రభుత్వము విద్యారంగము అభివృద్ధి చేసినాము అని చెప్పి ప్రచారం చేసుకోవడమే తప్ప అది కేవలం ప్రచారం మాత్రమే అని నిజం కాదని తెలిపారు. పాఠశాల మధ్యాహ్నం భోజనములో చిక్కి లకు డబ్బులు టెండర్ దారులను ఇబ్బంది పెట్టారని ఇప్పుడు ఏమి తెలియనట్టు నీతులు మాట్లాడుతూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం తప్ప జగన్ కు ఏం లేదని తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్ ఎస్ యు విద్యార్థి సంఘ నాయకులు ఎటువంటి సమస్య ఉన్న అధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. సంక్షేమ హాస్టల్ పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సంక్షేమ హాస్టలకు అధిక నిధులు కేటాయించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పక్షాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతుందని ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రభుత్వ విద్యా రంగంలో సంస్కరణ తీసుకొచ్చి ప్రభుత్వ విద్యను కాపాడుతామని తెలిపారు. ఆర్ ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కోసం ఉద్యమిస్తామన్నారు . దేశవ్యాప్తంగా కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరువు చూపాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సంక్షేమ హాస్టల్ లో మెసేజ్లు కాస్మత్ ఇన్చార్జిలు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భీమరాజు మాట్లాడుతూ దేశభక్త విధానంగా సమస్యల పరిష్కారానికి అందరితో కలిసి పోరాడుతామని తెలిపారు . కర్ణాటక రాష్ట్ర ఇంచార్జ్ సురేష్ గౌడ్ మాట్లాడుతూ అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ యు నాయకులు ఆకు మూల శ్రీధర్. ప్రశాంత్. కృష్ణారెడ్డి. నవీన్ కుమార్. చిరంజీవి. హరి. విజయ. హారతి. మహాలక్ష్మి. రోజా. ఆఫ్జోన్. మహబూబ్ బాషా. తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు