కుప్పం, త్రిశూల్ న్యూస్ :
ప్రతి రైతు సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చంద్రబాబు పని చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డా. కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. గురువారం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ నందు గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్సి శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కుప్పం రైతులు చాలా వరకు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న సందర్బంగా వారు ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదగాలని డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ తీసుకొచ్చిన విషయం గుర్తు చేశారు. ఇక్కడ నీటి కొరత ఎక్కువగా ఉండడంతో కృష్ణా జలాల ద్వారా కుప్పంకి హంద్రీ నీవా కాలువ ద్వారా కుప్పం మండలం పరమసముద్రం చెరువుకు నీరు చేరడం వల్ల కుప్పం ప్రాంతం ఇక వ్యవసాయం రంగంలో దూసుకుపోతుందన్నారు.
ఇక్కడే వ్యవసాయం.. ఇక్కడే మార్కెట్ ద్వారా క్రయ విక్రయాల ద్వారా రైతులు మరింత అభివృద్ధి చెందుతారని తెలిపారు. అందుకు ముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహనికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ గా జి.ఎం. రాజు, వైస్ చైర్మన్‌గా ప్రియా శరవణ ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం, ఉడా చేర్మెన్ డా. సురేష్ బాబు, టిటిడి బోర్డు సభ్యులు వైద్యం శాంతారామ్, అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment