కుప్పం, త్రిశూల్ న్యూస్ :
కృష్ణా జలాలకు హారతి ఇచ్చేందుకు కుప్పం పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి శాంతిపురం హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కలిసి సాదర స్వాగతం పలికారు. సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ప్రభుత్వ విప్, జి.డి.నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ తో పాటు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇతర శాఖాధికారులు ఉన్నారు.

No comments:
Post a Comment