కుప్పం ప్రజలకు శుభవార్త.. ఐఫోన్‌ విడిభాగాల తయారీ ప్రాజెక్ట్..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

August 28, 2025

కుప్పం ప్రజలకు శుభవార్త.. ఐఫోన్‌ విడిభాగాల తయారీ ప్రాజెక్ట్..!

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. అల్యూమినీయం తయారీలో మంచి పేరున్న హిందాల్కో సంస్థ.. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ భారీ ప్రాజెక్టును నిర్మించనుంది. దాదాపు రూ.586 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్‌లో తయారయ్యే అల్యూమినియం భాగాలు, ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఛాసిస్, ఎన్‌క్లోజర్ తయారీలో ముడి పదార్థాలుగా ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు - SIPB ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడి ఏపీ చరిత్రలో కీలకం కానుంది. ఏపీని ఆపిల్ గ్లోబల్ సప్లై చైన్‌లో భాగం చేయనుంది. కుప్పం భౌగోళికంగా చాలా వ్యూహత్మకమైన ప్రాంతం. బెంగళూరు నుంచి కేవలం 120 కిలోమీటర్ల దూరంలో ఉండడం కుప్పంకు ప్లస్ పాయింట్‌. ఇక చెన్నై నుంచి కుప్పం మధ్య దూరం 200 కిలోమీటర్లు మాత్రమే. ఈ రెండు నగరాల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే వెసులుబాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారికి ఉంటుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages