నీట మునిగిన కాలనీలను పరిశీలించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

August 28, 2025

నీట మునిగిన కాలనీలను పరిశీలించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి..!

సిద్ధిపేట, త్రిశూల్ న్యూస్ :
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జిల్లా కేంద్రంలో నీట మునిగిన పలు కాలనీలను గురువారం రోజున జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమీషనర్ అనురాధతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్త బస్టాండ్ నుండి మోడ్రన్ బస్టాండ్ మద్యలో రోడ్ వెంబడి బ్రిడ్జి పైన నీరు చేరిన ప్రాంతాలను పరిశీలించి నీటి ఉధృతి తగ్గేవరకు రాకపోకలు నిలిపివేయాలని పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. శ్రీనగర్ కాలనీలో నీట మునిగిన ప్రాంతాన్ని ఒక ప్రవేట్ అపార్ట్మెంట్ పైన నుంచి వీక్షించి నీటమునిగినన కాలని వాసులను సురక్షిత ప్రాంతాలను తరలించడం కోసం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను రప్పించి పునరావాస కేంద్రాలలోకి మళ్లించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కోమటిచెరువు మత్తడి నుండి నీరు ఉదృతంగా వెళ్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్సాన్పల్లి నుండి కోమటి చెరువు నీరు వచ్చే బ్రిడ్జి గుండా కాలువనిండ నీరు ఉదృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. శ్రీచైతన్య స్కూల్ ముందు భాగం లో ఉన్న కల్వర్టు గుండా నీరు ఉదృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి రోడ్ డ్యామేజ్ అయిన ప్రాంతంలో కోతకు గురికాకుండా ఇసుక బస్తాలు వెయ్యాలని అధికారులకు ఆదేశించారు. శ్రీనివాస్ నగర్ కాలనీలో నీట మునిగిన ప్రాంతాన్ని,లోహిత్ సాయి ఆసుపత్రి పైనుండి నర్సాపూర్ చెరువు నీట మునిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తూ కింద ఉన్న నర్సాపూర్ చెరువు మత్తడి ప్రాంతాన్ని పరిశీలించి నీరు వేగంగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వీరు వెంట ఏసిపి రవీందర్, తహసీల్దార్ కిరణ్, పోలీస్ ఇతర శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages