తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు పూర్తిగా అక్రమమని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఖండించారు.ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం కుట్రలకు తెరలేపిందన్నారు. ఆ క్రమంలోనే కాకాణి గోవర్ధన్ రెడ్డి పై అక్రమ కేసులు నమోదు చేశారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం "రెడ్ బుక్" రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రజల హక్కులను హరిస్తూ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గ పాలన రాష్ట్రానికి పెనువిపత్తని తెలిపారు. కూటమి అక్రమాలపై ప్రశ్నించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల గొంతు నొక్కేందుకు అధికార దుర్వినియోగం ద్వారా ప్రభుత్వం అక్రమ కేసులను నమోదు చేస్తోందని, ఇది పూర్తిగా అప్రజాస్వామికమన్నారు. మాకు, మా పార్టీకి న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని అన్నారు. న్యాయస్థానాలలోనే ఈ కుట్రలపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

No comments:
Post a Comment