యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం.. టిడిపి నేత కాయల రమణ యాదవ్..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

June 08, 2025

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం.. టిడిపి నేత కాయల రమణ యాదవ్..!

శింగనమల, త్రిశూల్ న్యూస్ :
శింగనమల మండలం బండమీద పల్లి గ్రామంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన టిడిపి నాయకులు సచివాలయం సిబ్బంది. ఈ సందర్భంగా కాయల రమణ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి మనిషి జీవితంలో మంచి ఆరోగ్యపు అలవాట్లు నడవడిక సంపూర్ణ ఆరోగ్యం, యోగ ద్వారా సాధ్యమవుతుందని దీన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో నెలరోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని, సింగనమల మండలం బండమీద పల్లి గ్రామంలో యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. యోగ ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం జరుగుతుందని మానసిక ఒత్తిడి తగ్గి మానసిక ఉల్లాసం కలుగుతాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామన్న యాదవ్, సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages