చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955 వేతన సవరణ చట్టం 1958 ను వెంటనే పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు అన్ని ప్రజాసంఘాలు కార్మిక సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన 44 కార్మిక చట్టాలలో జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలు ఉన్నాయని తెలిపారు. అన్ని విభాగాల్లోని జర్నలిస్టులను ఒకే గొడుగు కింద తెచ్చే విధంగా వర్కింగ్ జనరేట్ చట్టాన్ని అమలు చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తుంటే ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడం శోచనీయమన్నారు. వేతనాలకు సంబంధించిన 1958 వేతన సవరణ చట్టాన్ని కూడా రద్దు చేయడం జర్నలిస్టులకు కనీస వేతన సౌకర్యం కల్పించకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టులు కీలక భూమిక పోషిస్తున్న నేపథ్యంలో వారిని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు వారి కడుపు కొట్టే విధంగా చట్టాలను రద్దు చేయడం దారుణం అన్నారు. మీడియా కమిషన్ ఏర్పాటు జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాల్సిన ప్రభుత్వాలు వాటిని తుంగలో తొక్కి నల్ల చట్టాలను తీసుకొస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్టుల రక్షణ కొరకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఐక్య ఉద్యమాలతో జర్నలిస్టుల హక్కులను పరిరక్షించేందుకు ఏపీడబ్ల్యూజేఎఫ్ కృషి చేస్తుందని తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.ప్రకాష్ మాట్లాడుతూ జర్నలిస్టులకు అపారం నష్టం కలిగించే వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం వేతన సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం శోచనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని వివరించారు జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో జర్నలిస్టులు పాల్గొంటారని వివరించారు. జర్నలిస్టులకు మద్దతుగా ఏఐటియుసి నాయకులు నాగరాజు, సిఐటియు నాయకులు గంగరాజు, ఎస్టియు రాష్ట్ర నాయకులు గంటా మోహన్, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు రమణ తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు

No comments:
Post a Comment