తిరుమల శ్రీవారి సేవలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

July 23, 2025

తిరుమల శ్రీవారి సేవలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..!

తిరుమల, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తితిదే అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి శ్రీ వేంకటేశ్వర స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన స్పీకర్ గత ఐదేళ్ల కాలంలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం ప్రస్తుతం అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, వారి జీవితాలు శ్రేయస్సుగా సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages