సెప్టెంబర్ లో జాతీయస్థాయి మహిళా సాధికారత కమిటీ తిరుపతిలో సమావేశం..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

July 23, 2025

సెప్టెంబర్ లో జాతీయస్థాయి మహిళా సాధికారత కమిటీ తిరుపతిలో సమావేశం..!

- హాజరుకానున్న 31 రాష్ట్రాల మహిళ సాధికారత కమిటీల సభ్యులు

- జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించిన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
తిరుపతి లో సెప్టెంబర్ నెలలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది ఛైర్పర్సన్స్ ఆఫ్ కమిటీస్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ వెల్ఫేర్ కార్యక్రమం జరగనున్నది.. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు , డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు , జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలోని 31 రాష్ట్రాల నుంచి మహిళా సాధికారత కమిటీ సభ్యులు, పార్లమెంటు స్పీకరు, డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి హాజరవుతారని వివరించారు. సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. అంతకుమునుపు కలెక్టరేట్ కు విచ్చేసిన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకి , జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్ కి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికి వారిని సత్కరించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages