అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఏపీలో పాడి రైతులకు పశుసంవర్ధక శాఖ శుభవార్త చెప్పింది. పాడి రైతులు 20% శాతం చెల్లిస్తే ప్రభుత్వం 80% శాతం రాయితీ అందిస్తుందని పేర్కొంది. ఈ బీమా మూడేళ్లు ఉంటుంది. రూ.384 లు రైతు చెల్లిస్తే మూడేళ్ళ పాటు ఈ భీమా వర్తిస్తుంది. దీంతో పశువులు అకాల మరణం చెందితే రూ.30 వేల రూపాయలు బీమా పొందొచ్చు. గొర్రెలు, మేకలకు ఏదైనా సరే ప్రమాదవశాత్తు చనిపోయినట్లయితే రూ.6000లు బీమా లభిస్తుంది. ఇప్పటికే పశువులకు 50% రాయితీతో దాణా అందించడం
జరుగుతుందని పేర్కొంది.

No comments:
Post a Comment