తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రారంభమైన చేరికలు..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

August 25, 2025

తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రారంభమైన చేరికలు..!

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
తిరుపతి పద్మావతి పురంలోని అన్నమయ్య సమావేశ మందిరంలో టిటిడి మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో అధికార పార్టీ టిడిపిని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజేంద్ర రాయల్, పురుషోత్తం నాయుడును పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అధికార కూటమి ప్రభుత్వంపై పదిహేను నెలలకే ప్రజల్లో వ్యతిరేకత మూటకట్టుకున్నది అనడానికి ఈ చేరిక ఉదాహరణ, రానున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూస్తామని భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. ఒత్తిళ్లలో, నిర్భందంలో ఉన్న సమయంలో వీరి చేరిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతనోత్సాహాన్ని నింపుతోందని భూమన కరుణాకర రెడ్డి అన్నారు. పేదలకు మంచి చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు, వారికి వారే స్వయంగా వచ్చి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకొని చేరిన రాజేంద్ర రాయల్, పురుషోత్తం నాయుడులను అభినందిస్తున్నా అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లం రవిచంద్ర రెడ్డి గారు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages